Pages

Monday, July 25, 2011

బాలీవుడ్‌లో రెండో ఛాన్స్ కొట్టేసిన బొద్దందాల ఛార్మి!


బాలీవుడ్‌లో బొద్దాందాల సెక్సీతార ఛార్మి రెండో ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్‌లో వరుస పరాజయాలతో విసిగిపోయిన ఛార్మికి ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'బుడ్డా' కాస్త ఊరట నిచ్చింది. 

అంతేకాదు.. బాలీవుడ్ సినిమాలో నటించే రెండో ఛాన్స్‌ కూడా ఛార్మి దక్కించుకుంది. బుడ్డా హిట్‌తో బాలీవుడ్‌పై దృష్టి పెట్టాలనుకున్న ఛార్మి, ముంబైలోనే వుంటూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో "జిల్లా గజియాబాద్" పేరిట రూపొందనున్న మల్టీస్టారర్ చిత్రంలో ఛార్మికి ఛాన్సొచ్చింది. 

ఈ చిత్రంలో సంజయ్‌దత్, వివేక్ ఒబెరాయ్, హర్షద్ వాసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వినోద్ బచ్చన్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు రానుంది. ఇంకేముంది ఈ సినిమాలో ఛార్మి అందాలను ఆరబోసి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైందట.

No comments:

Post a Comment