Pages

Tuesday, July 26, 2011

విద్యా ‘డర్టీ’ డ్యాన్స్

VIDYA-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅలనాటి దక్షిణాది శృంగార తార సిల్క్‌స్మిత జీవిత గాథ ఆధారంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ‘డర్టీ పిక్చర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విద్యాబాలన్ కథానాయికగా నటిస్తోంది. మిలాన్ లూథ్రియా దర్శకుడు. ప్రారంభం నుంచి పలు విశేషాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. ఎనభై దశకాల్లోని దక్షిణాది సినిమా పాటని ప్రతిబింబించేలా ఈ పాటలో కొన్ని వేల కమలాఫలాలను వాడారు. కథానాయిక విద్యాబాలన్ నర్తిస్తుండగా ఆ పండ్లు ఆమెపై దొర్లుతూ వెళ్లేలా నృత్యదర్శకురాలు పోనీవర్మ డాన్స్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేసింది. ఈ పాట కోసం విద్యాబాలన్ చాలా శ్రమ పడాల్సివచ్చిందని నిర్మాత ఏక్తాకపూర్ తెలిపింది. ఈ చిత్రంలో దక్షిణాది సూపర్‌స్టార్‌గా నసీరుద్దీన్‌షా నటిస్తున్నాడు. కథానుగుణంగా ఆయన కూడా ఈ చిత్రంలో ఓ పాటకు డ్యాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment