Pages

Tuesday, July 26, 2011

పాట కోసం ప్రయోగం

oosarave-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaప్రేక్షకులని ఆకట్టుకోవాలంటే స్టార్స్‌వున్నా లేకపోయినా సినిమాలో ఏదోఒక ఆసక్తికరమైన అంశం వుంటే గానీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని బాగా వంటబట్టించుకున్నాడో ఏమోగానీ జూ.ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తను నటిస్తున్న ‘ఊసర టైటిల్ నిర్ణయించలేదు) చిత్రంలో ఓ కొత్త ఫీట్‌ని చేయబోతున్నాడు. తన దైన మార్క్ యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే క్రేజీ హీరోగా ఎదిగిన జూ.ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు డాన్సుల్లోనూ అదరగొడతాడన్న విషయం తెలిసిందే.

అయితే సురేందర్‌డ్డి దర్శకత్వంలో శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్‌పసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం జూ.ఎన్టీఆర్‌పై ఓ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. అయితే ఈ పాటకు తెలుగు చిత్ర పరిక్షిశమలోని టాప్ డాన్స్ మాస్టర్లలో ముగ్గురు నృత్యరీతులు సమకూర్చనున్నారని, క్లాసికల్, వెస్ట్రన్, రీమిక్స్, బీట్ ఇలా మూడు వేరియేషన్స్‌లో సాగే ఈ పాట ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుందని సమాచారం. ఇదిలావుంటే రామ్‌చరణ్ , అల్లు అర్జున్ డాన్సుల్లో గట్టిపోటీనివ్వడం వల్లే జూ.ఎన్టీఆర్ తన తాజా చిత్రం కోసం ముగ్గురు కొరియోక్షిగాఫర్లతో డిఫంట్ సాంగ్‌ని ప్లాన్ చేశాడని ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. జూ. ఎన్టీఆర్ చేస్తున్న ఈ పాట నిజంగానే ట్రెండ్ సెట్టర్‌గా మారుతుందో లేదో వేచి చూడాల్సిందే!

No comments:

Post a Comment