Pages

Wednesday, June 29, 2011

"ఆరెంజ్‌" దెబ్బ అదిరింది... అందుకే రామ్‌చరణ్ "రచ్చ"రచ్చ


రామ్‌చరణ్‌ తేజను 'ఆరంజ్‌' లాగి కొట్టింది. దాంతో తాను ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నాడు. వినాయక్‌తో సినిమా చేయాలని ఆశించాడు. వినాయక్‌ మాత్రం ఇంకా కథ కాలేదు... తప్పకుండా ప్రాజెక్ట్‌ చేస్తానని మాత్రం అంటున్నాడు. 

వినాయక్‌కూ 'బద్రినాథ్‌' షాక్‌ ఇచ్చింది. తాజాగా 'మెరుపు' చేయాలనుకున్న రామ్‌చరణ్‌ ప్రాజెక్ట్‌ వాయిదా పడింది. దాంతో సూపర్‌గుడ్‌ ఫిలిం 'రచ్చ' చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఇంకా కథలో కొద్దిగా మార్పులు చేయాలనీ, ప్రతి విషయంలో దర్శకుడు సంపత్‌నందితో చర్చ పెట్టడంతో దర్శకుడు అసహనానికి గురవుతున్నాడట. 

ఏదో పెద్ద హీరో కొడుకు అని భరిస్తున్నట్లు తెలిసింది. ఆరెంజ్‌ దెబ్బతో రామ్‌చరణ్‌‌కు ఏమి చేయాలో అర్థంకాక దర్శకుడిపై రచ్చచేస్తున్నాడని ఫిలింనగర్‌ జనం అనుకుంటున్నారు‌.

No comments:

Post a Comment