Pages

Thursday, June 16, 2011

ఛస్.. గాలి కబుర్లకు ఓ హద్దూపద్దూ ఉండాలి: జేజెమ్మ


అనుష్కకు కోపమొచ్చింది. ఇన్నాళ్లూ తనపై ఎన్ని గాలి కబుర్లు రాసినా పట్టించుకోని ఈ ముద్దుగుమ్మ ఈసారి మాత్రం ఒంటికాలిపై గాలి వార్తలు సృష్టించిన వారిపై ఎగిరెగిరి పడింది. గాలి కబుర్లకు కూడా ఓ హద్దూపద్దూ ఉండాలని మండిపడింది. 

ఇలాంటి అర్థంపర్థం లేని ఆధారాల్లేని వార్తలను ఎవరు పుట్టిస్తారో, ఎందుకు పుట్టిస్తారో, అందులో వాళ్లకు కలిగే ఆనందం ఏమిటో తనకైతే అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిందంటూ డప్పు కొడుతూ వచ్చిన వార్తలు అవాస్తమని తేల్చి చెప్పింది. 

అసలు తనకిప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన సైతం లేదని తేల్చేసింది. అటువంటి నిశ్చితాభిప్రాయంతో ఉన్న తనపై నిశ్చితార్థం చేసుకున్నదంటూ గాలి వార్తలు రాయడానికి ఎలా పూనుకున్నారోనని బాధపడుతోంది. సినిమా ఫీల్డుకొచ్చాక.. గ్లామర్‌తో పాటు గాసిప్‌ను అలవాటు చేసుకోవాలన్న సంగతి అనుష్కకు తెలియదేమోనని కొంతమంది ఫిలిం జనం అంటున్నారు.

No comments:

Post a Comment