Pages

Tuesday, June 14, 2011

మా ఎన్టీఆర్ ఊసరవెల్లా... ఆ పేరు బాగాలేదు.. మార్చండి!!


తెలుగు సినిమాలకు చిత్ర విచిత్రమైన టైటిల్స్‌ పెట్టడం పరిపాటే. పోకిరి, బ్రోకర్‌, ఆవారా వంటి రకరకాలు టైటిల్స్‌ హీరో పేరుమీద పెట్టేస్తారు. హీరో బలాదూర్‌గా ఉన్నా.. చివరికి నలుగురికి ఏదో మేలు చేసి మంచివాడిగా గుర్తింపు పొందుతాడు. పోకిరిలో మహేష్‌బాబు అలాగే చేశాడు. 

లేటెస్ట్‌గా ఎన్‌.టి.ఆర్‌. నటిస్తున్న చిత్రానికి 'ఊసరవెల్లి' పేరును ఖరారు చేశారు. కానీ ఆ దర్శక నిర్మాతలకు ఎన్‌.టి.ఆర్‌. అభిమానులు తెగ సందేశాలు పంపుతూ.. ఆఫీసుకు ఫోన్లు చేస్తూ... ఆ టైటిల్‌ వద్దని చెబుతున్నారు. ఊసరవెల్లి రకరకాలుగా రంగులు మారుస్తుంది. ఇది నెగెటివ్‌ అర్థం వస్తుందని వారు బాధపడిపోతున్నారు. 

అసలు ఈ బాధ వెనుక వేరే ప్రయోజనాలున్నాయని కొందరు భావిస్తున్నారు. నెగెటివ్‌ టైటిల్స్‌ ప్లస్‌ అవుతాయని ఒక వర్గం నమ్ముతుంది. శక్తి వంటి పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెడితే.. సినిమాను ఎందుకు ఆదరించలేదో చెప్పాలని తిరిగి ఫ్యాన్స్‌కు మేసేజ్‌లు వెళుతన్నాయట. ఇదిలా ఉంటే... ఊసరవెల్లి అనే టైటిల్‌ ఎన్‌.టి.ఆర్‌.కు చక్కగా సరిపోతుందని సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారట. 

ఎన్‌.టి.ఆర్‌. ఎక్కడ గొడుగు అక్కడ పడతాడని కొన్ని ఉదంతాలు నిరూపించాయని వారు వ్రూఫ్‌తోసహా చెబుతున్నారట. ఏది ఏమైనా ఈ టైటిల్‌ను మార్చే ప్రతిపాదన తమకు లేదని దర్శక నిర్మాతలు తేల్చేశారు. కనుక ఊసరవెల్లి.. ఊసరవెల్లే..!!

No comments:

Post a Comment