ఆ రెండు కేసుల్లో నిందితుడు: పవన్‌కళ్యాణ్ కథానాయకుడుగా నటించిన ‘పులి’ చిత్రం వీడియో రైట్స్ కోసం తన నుంచి రూ. 65 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ షాలిమార్ వీడియోస్ యజమాని అషఫ్ ్రఇచ్చిన ఫిర్యాదు మేరకు సి.కళ్యాణ్‌పై కేసు నమోదైంది. రైట్స్ ఇవ్వకపోగా.. డబ్బు తిరిగి ఇవ్వమంటే మద్దెలచెర్వు సూరి, భానుకిరణ్‌ల పేరు చెప్పి కళ్యాణ్ బెదిరించాడని అషఫ్ ్రఆరోపించారు. మరోపక్క అషఫ్ ్రకుమారుడైన అష్వాఖ్ ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై మరో కేసు నమోదైంది. ఈయన యునెటైడ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారు.
గతేడాది రమేష్, కళ్యాణ్‌లు మహేష్‌బాబు హీరోగా ‘ఖలేజా’ చిత్రాన్ని నిర్మించారు. దీని వీడియో రైట్స్‌కోసం రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రూ. 32.25 లక్షలు చెల్లించాడు. అయితే రైట్స్‌కు సంబంధించిన అగ్రిమెంట్ చేయమంటే మిగిలిన డబ్బు ఇమ్మంటూ కళ్యాణ్, సింగనమల మెలికపెట్టారు. దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వమంటూ అష్వాఖ్ కోరగా... చిత్రం రిలీజయ్యాక కలవమన్నారు. ఆ ప్రకారం వెళ్లిన అష్వాఖ్‌కు నిరాశే ఎదురైంది. వారిపై పలుమార్లు ఒత్తిడి తేగా గతేడాది ఆగస్టులో జూబ్లీహిల్స్‌లోని సి.కళ్యాణ్ కార్యాలయం బాలాజీ ల్యాబ్‌కు పిలిపించి సూరి పేరు చెప్పి బెదిరించారు.
No comments:
Post a Comment