Pages

Saturday, June 25, 2011

రిచా హెవీ షేపులు: అందుకే ఎగబడుతున్న కోలీవుడ్



ఒకటి రెండు సినిమాలు హిట్టవగానే హీరోయిన్‌లకు ఫేమ్‌ రావటంతోపాటు, పర్సనాలిటీలో మార్పులు కూడా వస్తాయి. ఇలియానాకయితే బిహేవియర్‌లో కూడా చాలా ఛేంజెస్‌ వచ్చాయి. ఇక రిచా గంగోపాధ్యాయ మాత్రం అందరితో కలివిడిగా ఉంటూ, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే హీరోయిన్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. 

ఇది ఒకవిధంగా తన కెరీర్‌కు మంచిదే. అయితే ఈ ఆనందంలో తినటం, తిరగటం విషయంలో జాగ్రత్తలు పాటించకపోవటంతో లావెక్కింది. దీంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఈ విషయంపై లేటుగా స్పందించినా, తన షేప్‌లను కాపాడుకునేందుకు ఇప్పుడు ఎంతో కష్టపడుతోంది. అయితే ఇప్పుడా హెవీ పర్సనాలిటీయే రిచాకు కోలీవుడ్‌ అవకాశాలను తెచ్చిపెట్టింది. 

శింబుతో 'దబాంగ్‌' రీమేక్‌లో, ధనుష్‌తో మరో సినిమాలో నటించనుంది. నటనపరంగా రిచా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. అందుకే సరైన డైరెక్టర్‌తో వర్క్‌చెస్తే నటిగా తనేంటో నిరూపించుకోవటంతోపాటు, యాక్టింగ్‌ స్కిల్స్‌ను తెలుసుకోవచ్చని వెయిట్‌ చేస్తూ వచ్చింది. 

ఇప్పుడు సెల్వరాఘవన్‌ ధనుష్‌తో తీస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం రావటంతో ఆనందంగా ఉంది. అయితే ఈ సినిమాలో రిచాతోపాటు ఆండ్రియా కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. మరి సెల్వరాఘవన్‌ రిచాపై ఎంతవరకు శ్రద్ధ చూపిస్తాడనేది చూడాలి..!

No comments:

Post a Comment