A blog for all Tollywood news,gossips,movie information, ratings, openings.....
Pages
▼
Thursday, June 30, 2011
మణిరత్నం డైరెక్షన్‌లో శ్రీదేవి కూతురు జాహ్నవి..?!!
పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం సంగతి ఎలా ఉన్నా అతిలోకసుందరి శ్రీదేవి తన పెద్ద కుమార్తె జాహ్నవిని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నెం.1 డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తన కుమార్తెను పరిచయం చేస్తే ఇక తిరుగే ఉండదన్న ఆలోచనతో ఆయనను సంప్రదించినట్లు సమాచారం.
మణిరత్నం కూడా నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్‌తో ఓ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అతడి సరసన హీరోయిన్‌కోసం వెతికే పనిలో ఉన్నాడట. ఇంతలో తన కుమార్తె హీరోయిన్‌గా చేస్తుందని శ్రీదేవి చెప్పడంతో, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు మణిరత్నం ఓకే చెప్పేశాడట.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళుతుందని సమాచారం. మరి జాహ్నవి ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
No comments:
Post a Comment