Pages

Tuesday, June 7, 2011

తన "రేటు" తగ్గలేదని బడాయిపోతున్న కాజల్



కొంతమందికి చిత్రం ఫ్లాప్‌ అయితే వెంటనే తర్వాత చిత్రం రేటు తగ్గిపోతుంది. కానీ నటి కాజల్‌కు అలా జరగడం లేదు. ఇంకా పెరిగింది. ఇది తెలుగులో కాదండోయ్‌. పక్క రాష్ట్రం కన్నడలో.

మొన్నీమధ్య ఇంటర్య్వూలో కాజల్ మాట్లాడుతూ... తను తమిళ, తెలుగులో బిజీగా ఉన్నాననీ, మహేష్‌తో బిజినెస్‌, పవన్‌తో గబ్బర్‌సింగ్‌ చేస్తున్నాననీ చెప్పింది. చిత్రం... అన్నీభారీ చిత్రాలే వస్తున్నాయనీ, అది తన అదృష్టంగా భావిస్తున్నానని గప్పాలు కొట్టింది. 

కన్నడలో అడుగుతున్నారనీ, కానీ చేసే సమయం లేదని చెప్పింది. అయితే ఆమెతో 'డార్లింగ్‌' చిత్రాన్ని రీమేక్‌ చేయాలనే కన్నడ నిర్మాత ప్రయత్నిస్తున్నాడు. కాజల్‌ డేట్స్ కుదరలేదని చెప్పిందట. దీంతో పారితోషికాన్ని రెండు కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలిసింది. దీంతో డేట్స్‌ ఎడ్జస్ట్‌మెంట్‌ గురించి ఆలోచిస్తోందట. అవునుమరి.. డబ్బిస్తే... కొండమీద కోతైనా కిందికి దిగిరాదూ!!

No comments:

Post a Comment