Pages

Saturday, June 25, 2011

అందగత్తె ఐశ్వర్య ప్రెగ్నెంటా..? ఛ.. ఆమెను ద్వేషిస్తున్నా: వర్మ



బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌ను ద్వేషిస్తున్నాంటూ రాంగోపాల్ వర్మ తన ట్వట్టర్‌లో ట్వీట్ ఇచ్చుకున్నాడు. ఆమె అంటే తనకు ఎంతో అభిమానమనీ, అయితే ఆమెను తల్లిగా చూడటానికి మాత్రం తను ఇష్ట పడటం లేదని అన్నాడు. 

అయితే ఐశ్వర్యారాయ్ గర్భవతి అయినందుకు అభిషేక్ బచ్చన్‌కు అభినందనలు తెలుపుతున్నానని అన్నాడు. తనకు గతంలో తను ఎంతగానో ప్రేమించిన కలల రాణి శ్రీదేవి గర్భవతి అయినపుడు ఇటువంటి ద్వేషమే కలిగిందట. 

మొత్తానికి రాంగోపాల్ వర్మ ద్వేషించినా, ద్వేషంలోనే తన అభిమాన తారలకు అభినందనలు కూడా చెప్పేస్తారు. అందుకే రాము ఫిలిమ్ ఇండస్ట్రీలో సెపరేట్ ఐకన్.

No comments:

Post a Comment