Pages

Wednesday, June 15, 2011

మిస్టర్ నోకియా: మోటార్ బైక్ పైనుంచి మనోజ్ పల్టీ


Manoj

మంచు మనోజ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్‌ నోకియా సినిమా షూటింగ్‌లో స్వల్పంగా గాయపడ్డారు. మోటార్ బైకుపై ఫీట్ చేసే యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా బైకు పైనుంచి పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్మాత తెలిపారు. 

గాయాలు అంత ప్రమాదకరమైనవి కాకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. త్వరలోనే మనోజ్‌ కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. మనోజ్ ప్రమాదానికి గురవడంపై అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంచు సన్నిహితులు తెలిపారు.

No comments:

Post a Comment