Pages

Friday, June 17, 2011

Balayya wants do Narthanasala


బాలకృష్ణ నర్తనశాల సినిమాపై మనసు పారేసుకుంటున్నరట. ఈ సినిమాను చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ద్రౌపది పాత్రకు ఎంపికైన సౌందర్య అకాల మృతితో నర్తనశాల సినిమా నిర్మాణం ఆగిపోయింది. బాలయ్యకు ఇది డ్రీమ్ ప్రాజెక్టేనట. అయితే, లగాన్ సినిమాలో నటించిన గ్రేసీ సింగ్‌ను ద్రౌపది పాత్రకు ఎంపిక చేసి సినిమా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అనుకున్నట్లు 2009లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత స్నేహను ద్రౌపది పాత్రకు ఎంపిక చేసి మగధీర సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులను తీసుకుని అద్భుతంగా చిత్రాన్ని నిర్మించాలని కూడా బాలయ్య అనుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, అది కూడా కార్యరూపం ధరించలేదు.
తాజాగా, మళ్లీ నర్తనశాల సినిమా చేయాలనే ఆలోచనలో బాలకృష్ణ పడినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి పాత తరం నటులు నర్తనశాల సినిమాను రక్తి కట్టించారు. ఎన్టీఆర్ నటించిన బృహన్నల పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించాలని బాలయ్య ఉవ్విళ్లూరుతున్నారట. నాట్యాచారిణిగా బృహన్నల పాత్రలో ఎన్టీఆర్ నటనను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేరు

No comments:

Post a Comment