Pages

Tuesday, January 31, 2012

జూ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘యాక్షన్’ లేదా ‘బాద్‌షా’?


జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి ‘యాక్షన్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ...‘బాద్ షా’ అనే మరో టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ కథ-స్క్రిప్టు ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పటి వరకు టైటిల్ ఏమిటి అనేది ఖరారు చేయలేదు.

ఈ సినిమా టైటిల్ విషయమై గోపీ మోహన్ తన మైక్రో బ్లాగింగ్లో స్సందిస్తూ...ఇప్పటి వరకు సినిమా టైటిల్ ఫైనల్ చేయలేదని....‘యాక్షన్’ టైటిల్ తో పాటు ‘బాద్‌షా’ అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉందని, త్వరలోనే అధికారకంగా అనౌన్స్ చేస్తామని ప్రకటించినట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment